Advertisement
Google Ads BL

రామ్ చరణ్ కంటే ముందు రీమేక్ తో!


ప్రస్తుతం దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘కిక్‌2’పనులతో బిజీగా ఉన్నాడు. కాగా ఈ చిత్రం తర్వాత ఆయన రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి కోనవెంకట్‌, గోపీమోహన్‌ అందించిన స్టోరీ చరణ్‌తో పాటు మెగాఫ్యామిలీని కూడా మెప్పించడంతో ఈ సినిమా ఖరారైనట్లే తెలుస్తోంది. అయితే రామ్‌చరణ్‌ ప్రస్తుతం శ్రీనువైట్ల సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం విడుదల కావాలంటే అక్టోబర్‌ 15వరకు వెయిట్‌ చేయాల్సివుంది. అంటే దాదాపు నవంబర్‌ తొలివారంలో గానీ సురేందర్‌రెడ్డి, రామ్‌చరణ్‌ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం లేదు. కాగా ఈ గ్యాప్‌లో సురేందర్‌రెడ్డి ఓ లోబడ్జెట్‌ చిత్రాన్ని, అందునా ఓ తమిళ రీమేక్‌కు దర్శకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది. తమిళంలో ‘గోలీసోడా’గా రూపొంది విడుదలైన తర్వాత అద్భుతమైన విజయాన్ని చవిచూసిన ఈ సినిమాను సురేందర్‌రెడ్డితో రీమేక్‌ చేయాలని ఈ చిత్రం రీమేక్‌రైట్స్‌ సొంతం చేసుకున్న నిర్మాత లగడపాటిశ్రీధర్‌ ఉన్నాడు. ఈ చిత్రంలో లగడపాటి శ్రీధర్‌ కుమారుడు ముఖ్యభూమికను పోషించేలా శ్రీధర్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs