ఎందుకంత బద్ధకం అంటున్న టబు..!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు టబు గురించి ఎవర్నడిగినా గొప్పగా చెబుతారు. ఎలాంటి పాత్రల్లోనైనా ఆమె అదరగొట్టేస్తుంది. అందానికి ప్రాధాన్యమున్న పాత్రయినా, అభినయం కావాలన్నా వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటోంది. అయితే ఆమె ఇటీవల తనకొస్తున్న పాత్రలపై అసంతృప్తి వ్యక్తం చేసింది టబు. నాకు సరైన పాత్రలు ఇవ్వడం లేదు, కొత్త తరహా పాత్రల్ని సృష్టించడంలో దర్శకులకు ఎందుకంత బద్ధకమో అర్థం కావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. రెండుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు అందుకొంది టబు. అలాంటి నటి అందుబాటులో ఉన్నప్పుడు గొప్ప పాత్రలెన్నో క్రియేట్ చేయవచ్చు. కానీ టబుకి మాత్రం అంతా సీరియస్ పాత్రలే అప్పజెబుతున్నారట. అవి చేసినా ఒక్కటే చేయకపోయినా ఒక్కటే అంటోంది. వెరైటీ పాత్రల్ని సృష్టించండని ఆమె దర్శకులకి కాస్త ఘాటుగానే సవాల్ విసిరింది. ఇటీవల టబు హిందీ దృశ్యంలో నటించింది. తెలుగులో నదియా పోషించిన పోలీస్ పాత్రని హిందీలో టబు చేసింది. ఆ పాత్రతో మరోసారి అదుర్స్ అనిపిస్తానని చెప్పుకొచ్చింది టబు. నలభయ్యేళ్లు వయసు మీదపడుతున్నా ఇప్పటికీ తరగని అందంతో కనిపిస్తున్న టబు మరిన్ని మంచి పాత్రల్లో నటించాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పింది.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads