మంచు విష్ణు హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తమిళ ‘అరిమనంబి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం ‘డైనమైట్’. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఈనెల 24న విడుదల చేయాలని భావిస్తున్నారు. ‘బాహుబలి’కి భయపడేది లేదంటూ వారు ఈ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నారు. మరోవంక అదే రోజు మారుతి ‘పాండవుల్లో ఒక్కడు’ కూడా రిలీజ్‌కు సిద్దమవుతోంది. మరోపక్క అల్లరి నరేష్ తన తాజా చిత్రం ‘జేమ్స్‌బాండ్’పై బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఆయన తన ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఈనెల 17న విడుదల చేస్తామని ప్రకటించారు కూడా. అయితే ‘బాహుబలి’ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు కుమ్మేస్తుండటంతో ధైర్యం చేసి విడుదల చేస్తాడో? లేక మరో డేట్ చూసుకుంటారో వేచిచూడాల్సివుంది!