Advertisement
Google Ads BL

'రుద్రమదేవి' హిట్ కి ఈ స్పెషల్ చాలు!


>గుణశేఖర్‌ కలల ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం ‘రుద్రమదేవి’. భారతదేశపు మొట్టమొదటి హిస్టారికల్‌ 3డీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో ‘రుద్రమదేవి’ పాత్రను అనుష్క పోషించగా, కీలకపాత్ర అయిన గోనగన్నారెడ్డి పాత్రను అల్లుఅర్జున్‌ పోషించాడు. రానా, నిత్యామీనన్‌ లు  కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం మెయిన్‌హైలెట్‌గా నిలుస్తుందని, ఆయన అందించి రీరికార్డింగ్‌ సినిమాలోని సీన్స్‌ను హైలైట్‌ చేసేలా ఉందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులో బిజీగా ఉన్న ఈ సినిమా, 3డీ పనుల్లో జాప్యం కారణంగా చాలాసార్లు వాయిదా పడింది. ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నీ చివరి దశకు చేరుకోవడంతో త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే యోచనలో చిత్ర యూనిట్‌ ఉంది. ఇక ఈ సినిమాకు ఎన్‌హాన్స్‌డ్‌ డెప్త్‌ సొల్యూషన్స్ (ఈడీఎస్‌) అనే టెక్నాజీని వాడడం విశేషంగా కనిపిస్తోంది. ఈ టెక్నాలజీతో 3డీ సినిమాను చూడటానికి ఎటువంటి 3డీ అద్డాలు వాడాల్సిన అవసరం ఉండదు. ఈ టెక్నాలజీ తెలుగు  ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుందని గుణశేఖర్‌ ఎంతో ఆశతో ఉన్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs