>ప్రిన్స్ మహేష్‌బాబు సినిమాల ఎంపిక విషయంలో పూర్తిగా పంథా మార్చాడు. పోకిరి, దూకుడు వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలతో మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ట్రెండ్‌ను సెట్ చేసుకున్న మహేష్ ఇప్పుడు మాస్ సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నాడా..? అంటే ఔనననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఈ విషయాన్ని తాజాగా ఆయన ఒప్పుకున్న సినిమాలు కూడా బలపరుస్తున్నాయి. ప్రస్తుతం శ్రీమంతుడు వంటి సాఫ్ట్ టైటిల్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్న మహేష్ త్వరలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌లో పాల్గొన్నబోతున్నాడు. దీంతో పాటు క్లాస్ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో కూడా మహేష్ నటించబోతున్నాడు. ఇలా వరుసగా మహేష్ క్లాస్ చిత్రాలు ఒప్పుకోవడం ఆయన అభిమానులకు నచ్చడం లేదని తెలిసింది.