‘ఐ’ చిత్రం తర్వాత తాను పోగొట్టుకున్న వాల్యూని మరలా పొందడానికి ‘రోబో2’ సీక్వెల్ కోసం శంకర్ భారీ కసరత్తులే చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఆల్‌రెడీ సౌతిండియన్ సూపర్‌స్టార్ ఓకే చెప్పాడని, దక్షిణాది భాషల్లో షారుక్ విలన్‌గా చేస్తాడని, బాలీవుడ్‌లో షారుక్ హీరోగా చేస్తే రజనీ విలన్‌గా చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇవ్వన్నీ కేవలం ఊహకే పరిమితం అయ్యాయి. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా చేస్తుండగా, గతంలో కొన్ని చిత్రాల్లో విలన్‌గా నటించిన విక్రమ్ అన్ని భాషల్లోనూ విలన్‌గా చేయనున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రం ఇంకా ప్రీపొడక్షన్ పనుల్లోనే ఉంది. ఏ విషయం క్లారిటీ రావాలంటే మరికొంతకాం వెయిట్ చేయాల్సిందే.