>‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఇటీవల వచ్చిన ‘జిల్’ చిత్రంతో తన హాట్ హాట్ అందాలతో అందరిదృష్టిని ఆకర్షించిన హీరోయిన్ రాశిఖన్నా. ప్రస్తుతం ఆమె రామ్ సరసస ‘శివం’, రవితేజ సరసన సెకండ్ హీరోయిన్‌గా ‘బెంగాల్‌టైగర్’ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో ఈ అమ్మడు మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ సరసన నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘పటాస్’ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో సాయి సరసన రాశిఖన్నా ఎంపికైంది. ఒక్క హీరోయిన్ తమ కాంపౌండ్‌లోకి అడుగుపెడితే ఇక మెగా హీరోలందరూ అదే హీరోయిన్‌తో క్యూ కట్టడం ఆనవాయితీగా వస్తోంది. సో.. రాశిఖన్నాకు ఈ చిత్రం మరి మిగిలిన మెగాహీరోల సరసన కూడా అవకాశం తెప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.