>స్వాతిరెడ్డి మెయిన్ పాత్రలో ప్రస్తుతం ‘త్రిపుర’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కాగా స్వాతికి తమిళ్, మలయాళంలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ బాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఇక్కడే స్వాతి కాస్త ఎక్కువగా ఆశపడింది. ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో కూడా ఏకకాలంలో నిర్మించమని పట్టుబట్టిందట. దీంతో నిర్మాత దర్శకులు తమకిష్టం లేకపోయినా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్‌తో మంతనాలు జరిపారు. అయితే ఈ సినిమా హిట్ అయితే రీమేక్ రైట్స్ కొని సినిమాను హిందీలో పునర్నిర్మించడానికి సిద్దమే అని, అయితే స్వాతి బదులు మరో హీరోయిన్‌ను చూసుకుంటామని చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో స్వాతి ఫీల్ అయినట్లుగా టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.