>వాస్తవానికి ‘దృశ్యం’ రీమేక్‌ను తమిళంలో రజనీకాంత్‌తో చేయాలని అనుకున్నారట. అయితే ఈ చిత్రంలో పోలీసులు హీరోని కొట్టే సన్నివేశాలు, ఆయన కుటుంబాన్ని కూడా తీవ్రంగా హింసించే సంఘటనలు ఉండటంతో ఈ చిత్రానికి రజనీ నో అని చెప్పాడట. ఇలాంటి సన్నివేశాలను నా అభిమానులు ఒప్పుకోరు.. అందువల్ల సినిమాకి ఎంతో మైనస్ జరుగుతుంది. కాబట్టి అనసరంగా నాతో ప్రయోగాలు చేయవద్దు.. కమల్‌తో ఈ సినిమా చేయండి అని రజనీ దర్శకుడు జీతూజోసెఫ్‌కు సలహా ఇచ్చాడట. ఈ విషయాన్ని జీతూ జోసెఫ్ స్వయంగా తెలిపాడు.