‘బాహుబలి’ చిత్రంలోని కీలకమైన టెక్నీషియన్స్‌లో సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్‌ది కీలకపాత్ర. ఈ సినిమాకు సంబంధించిన రాజమౌళి ఊహలను తన కెమెరా కన్ను ద్వారా తెరపై అద్బుతంగా ఆవిష్కరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. గతంలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రదానంగా వచ్చిన ‘అరుంధతి, యమదొంగ, మగధీర, ఈగ’ వంటి చిత్రాలకు ఈయనే వర్క్ చేశాడు. ఆయన ‘బాహుబలి’ చిత్రం గురించి మాట్లాడుతూ... ‘బాహుబలి’ సినిమా మా టీంకే కాదు. భారతీయులంతా గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటుంది. ఇలాంటి సినిమా మళ్లీ ఎవరైనా తీస్తారో లేదో తెలియదు. ఇప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ‘మాయాబజార్’ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం... ఇకపై ‘బాహుబలి’ గురించి కూడా ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది.. అని తెలిపాడు.
Advertisement
CJ Advs