దాదాపు 70కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘రుద్రమదేవి’. అందునా తనే నిర్మాతగా దర్శకునిగా గుణశేఖర్ చేస్తోన్న సాహసం ఇది. అనుష్క, రానా, అల్లుఅర్జున్, నిత్యామీనన్ వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ చిత్రంపై బయ్యర్లు పెద్దగా ఆసక్తిచూపడం లేదు. చివరకు మెగాస్టార్ చిరంజీవితో వాయిస్‌ఓవర్ ఇప్పించినప్పటికీ అది కూడా వర్కౌట్ కాలేదు. దాంతో తాజాగా మహేష్‌బాబు తనకు ‘ఒక్కడు’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చాడన్న కృతజ్ఞతతో ఈ చిత్రం ప్రమోషన్లలో తనని కావాలంటే వాడుకోమని గుణశేఖర్‌కు చెప్పాడట. తాను ప్రమోషన్ చేయడానికి సిద్దమే అని.. అయితే ముందు నుండి పక్కా ప్రణాళికతో చేస్తే దానికి తాను సిద్దమే అని గుణకు కబురు పంపాడట. మరి మహేష్ క్రేజ్ అయినా ‘రుద్రమదేవి’ని బయటపడవేస్తుందో లేదో చూడాలి....! అయినా మహేష్ ఈ విషయంలో చాలా ఆలస్యంగా స్పందించాడని, అదే గోనగన్నారెడ్డి పాత్రను చేయమని గుణ అడిగినప్పుడు అదే చేసివుంటే సరిపోయేది కదా! అనే విమర్శలు వినిపిస్తున్నాయి.