బన్నీ ‘ఆ అమ్మాయి’ని వదలడం లేదా...?
త్వరలో అల్లుఅర్జున్`బోయపాటిశ్రీనుల కాంబినేషన్‌లో గీతాఆర్ట్స్ బేనర్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో బన్నీ సరసన మెయిన్ హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోంది. కాగా రెండో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. చివరకు రెండో హీరోయిన్ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. బన్నీ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో నటించిన కేథరిన్ వైపే బన్నీ దృష్టి సారిస్తున్నాడని సమాచారం. బన్నీతో కలిసి ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో నటించిన కేధరిన్‌కు ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. సినిమా ఫ్లాప్ కావడమే కాదు... సినిమాలో బన్నీ`కేథరిన్‌ల మధ్య స్క్రీన్ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ఈ జంట బన్నీ అభిమానులను కూడా అలరించలేకపోయింది. మరి ఈ తాజా చిత్రంలో అయినా బన్నీతో కేథరిన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి...!
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads