‘భీమవరం బుల్లోడు’ చిత్రం తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న సునీల్ ప్రస్తుతం వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడు. వాసు వర్మ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ సగం పూర్తయింది. దర్శకుడు వంశీ ఆకెళ్ళతో చేయబోయే మరో సినిమా మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటివరకు ఎవరిని ఫైనల్ చేయలేదు.
ఇందులో బాగంగా చిత్ర యూనిట్ బాలీవుడ్ లో హీరోయిన్ కోసం సెర్చింగులు చేస్తుంది. సునీల్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ప్రాచి దేశాయ్ ని సంప్రదించారట. దర్శకుడు చెప్పిన కథ ఆమెకు నచ్చడంతో ఓకే చెప్పిందని సమాచారం. ఈ విషయమై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారట. 'ప్రేమకథా చిత్రమ్’ సినిమాను నిర్మించిన సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.