>నందమూరి కళ్యాణ్‌రామ్‌కు ‘పటాస్’ కేవలం రెండో హిట్టు మాత్రమే. కానీ ఆయన నిర్మించి నటించిన పలు చిత్రాలతో ఆయన ఆర్దికంగా బాగా దెబ్బతిన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సురేందర్‌రెడ్ది తనను దర్శకునిగా పరిచయం చేసిన కళ్యాణ్‌రామ్‌కు ‘కిక్2’ చేసిపెడతానని మాట ఇవ్వడంతో కళ్యాణ్‌రామ్ బాగా హ్యాపీగా ఫీలయ్యాడట. ఆల్‌రెడీ సూపర్‌హిట్టు అయిన ‘కిక్’కి సీక్వెల్ కావడంతో ఇక తన పంట పడిరదని, ఇబ్బందుల్లో నుండి బయటపడవచ్చని భావించాడు. కానీ సురేందర్‌రెడ్డి ‘కిక్2’ చిత్రాన్ని సాగదీస్తూనే రావడంతో వర్కింగ్ డేట్స్ పెరిగిపోయాయి. నిడివి కూడా మూడు గంటలకు పైగానే వచ్చిందని సమాచారం. ఇక నిడివి తగ్గింపుకు కూడా దర్శకుడు ఒప్పుకోవడం లేదు. చాలా సీన్లను రీషూట్ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ చిత్రం బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. అందునా టాలీవుడ్‌లో సీక్వెల్ అంటే ఫ్లాప్ అనే అబిప్రాయం ఉండటంతో బయ్యర్లు నుండి కూడా క్రేజీ ఆఫర్స్ రావడం లేదు. సో... ఈ ఇబ్బందుల నుండి కళ్యాణ్‌రామ్ బయటపడతాడా? లేదా? అన్నది ‘కిక్2’పైనే ఆధారపడివుంది. అలాగే ‘పటాస్’ హిట్టు కావడంతో తన తాజా చిత్రం ‘షేర్’లోని పలు సీన్లను మార్చి తీస్తున్నారని తెలుస్తోంది.