Advertisement
Google Ads BL

సుకుమార్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఎవరితో..?


జులై 9వ తేదీ నుండి ఎన్టీఆర్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ లండన్‌లో ప్రారంభంకానుంది. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దిగనుంది. కాగా ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అవి ఉట్టిపుకార్లే అని తేలిపోయింది. సుకుమార్‌ చిత్రం పూర్తయిన వెంటనే  ఎన్టీఆర్‌ కొరటాలశివ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం సుకుమార్‌ సినిమా విడుదలైన వెంటనే అంటే వచ్చే ఏడాది జనవరిలో జరుగనుంది. వాస్తవానికి ‘మిర్చి’ చిత్రం తర్వాత కొరటాల శివ రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లలో  ఒకరితో చిత్రం చేయాలని భావించాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌లు మెటీరియలైజ్‌ కాలేదు. తాజాగా ఎన్టీఆర్‌కు కొరటాలశివ మరో స్టోరీ వినిపించాడని, ఆ స్టోరీ ఎన్టీఆర్‌కు విపరీతంగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌ మెటీరియలైజ్‌ అయిందని, ఈ చిత్ర నిర్మాత ఎవరు? హీరోయిన్‌ ఎవరు? వంటి విషయాలు త్వరలోనే తెలియనున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs