Advertisement
Google Ads BL

మెగాఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్‌...!


చిరంజీవికి ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్‌కు మధ్య విభేదాలు ఉన్నట్లు మీడియాలో చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రూమర్స్‌కు ప్రత్యక్ష ఖండన వంటి ఈవెంట్‌ ఒకటి జరుగనుంది. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది మరేదో కాదు... మెగాస్టార్‌ చిరంజీవి 60వ పుట్టిన రోజు వేడుకలే. చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు పవన్‌కళ్యాణ్‌ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత  అధ్యక్షుడు స్వామినాయుడు మీడియాకు తెలిపారు. నెల్లూరులో జరిగిన చిరంజీవి యువత కార్యక్రమాల్లో ఆయన ఈ విషయం చెప్పారు. ఆగష్టు 22వ తేదీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే చిరు పుట్టినరోజు వేడుకల్లో అభిమానులు భారీస్థాయిలో పాల్గొంటారని అన్నారు. ఈ వేడుకలకు పవన్‌కళ్యాణ్‌ కూడా వస్తున్నాడని నాగబాబు తెలియజేశాడని స్వామినాయుడు తెలిపాడు.  

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs