నటునిగా, రైటర్‌గా, సింగర్‌గా, చివరకు సంగీత దర్శకునిగా కూడా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రఘుకుంచె. ఆయన తెలుగులో ‘బంపర్ ఆఫర్’ చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం మంచి మ్యూజిక్‌హిట్టుగా నిలిచింది. తాజాగా ఆయన సంగీతం అందించిన ‘దొంగాట’ చిత్రం విడుదలైంది. కాగా రఘుకుంచెకు ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో ఒక మంచి చాన్స్ వచ్చింది. అక్కడి స్టార్ హీరోలలో ఒకడైన దర్శన్ హీరోగా నటించే చిత్రానికి రఘుకుంచె సంగీత దర్శకునిగానే కాదు.. సింగర్‌గా కూడా పరిచయం అవుతున్నాడు. మరి కన్నడ పరిశ్రమ అయినా ఆయన టాలెంట్‌ను గుర్తిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది....!