జియాఖాన్ ఆత్మహత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. హిందీ 'గజినీ' సినిమాలో అమీర్‌ఖాన్ సరసన అలరించిన ఈ యువతార చిన్న వయసులోనే ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అయితే జియాఖాన్ ఆత్మహత్యకు బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్‌పంచోలియే కారణమంటూ ఆమె తల్లి ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ కేసును తన చేతిల్లోకి తీసుకున్న సీబీఐ ఇటీవలే సూరజ్ పంచోలిని విచారించింది. అంతక్రితం నెలలోనే అతని తండ్రి ఆదిత్య పంచోలిని కూడా సీబీఐ విచారించింది. అంతేకాకుడా సూరజ్ పంచోలిని మరోసారి విచారిస్తామని కూడా సీబీఐ తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఈ కేసును సీబీఐ త్వరలోనే ఓ కొలిక్కి తెస్తుంద్న విశ్వాసం వ్యక్తమవుతోంది. మరి జియాఖాన్ ఆత్మహత్యకు సూరజ్ పంచోలికి నడుమ ఉన్న సంబంధాన్ని సీబీఐ అయినా బట్టబయలు చేస్తుందేమో వేచిచూడాలి.