Advertisement
Google Ads BL

మరో చాలెంజింగ్‌ క్యారెక్టర్‌లో విద్యాబాలన్‌..!!


చాలెంజింగ్‌ క్యారెక్టర్లను పోషించడంలో బాలీవుడ్‌లో అందరికంటే ముందు వినిపించే పేరు విద్యాబాలన్‌. డర్టీ పిక్చర్‌, కహాని తదితర చిత్రాలతో ఆమె బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఈ నటి మరో చాలెంజింగ్‌ క్యారెక్టర్‌లో నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. భారత దేశపు ఉక్కు మహిళగా పేరుగాంచిన మాజీ ప్రధాని ఇందిరా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో ఇందిరా నటించనుంది.

Advertisement
CJ Advs

ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించడానికి డైరెక్టర్‌ మనీష్‌గుప్తా రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టర్‌ కోసం పలువుర్ని పరిశీలించిన ఆయన చివరకు విద్యాబాలన్‌ను కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు. అయితే మొదట ఈ సినిమాకు ఓకే చెప్పడానికి విద్యాబాలన్‌ కూడా తటపటాయించిందట. ఈ సినిమాలు నటిస్తే ఏవైనా వివాదాలు చుట్టుముడతాయని భయపడ్డ ఆమె స్క్రిప్ట్‌ను పూర్తిగా చదివిన తర్వాత మనీష్‌గుప్తాకు పచ్చజెండా ఊపిందట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కె అవకాశం ఉంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs