ఏ పాత్రకు ఏ నటులను తీసుకోవాలో వర్మకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. సరైన కాస్టింగ్ ఎంపికలో ఆయనది అందెవేసిన చేయి. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను కాల్చి చంపిన పోలీస్ కథతో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఆయన వీరప్పన్ పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. అచ్చు వీరప్పన్‌లా ఉన్న ఆ నటుడి పేరు సందీప్ భరద్వాజ్. ఈయన థియేటర్ ఆర్టిస్ట్. వీరప్పన్ లుక్స్,
మేనరిజమ్స్... ఇలా అన్ని తెలుసుకొని ఆ పాత్రలో సందీప్ లీనమైపోయాడట. ఈ చిత్రంలో వీరప్పన్‌ను చంపిన పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ పోషిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరి ఈ చిత్రమైనా వర్మకు ‘రక్తచరిత్ర’ తెచ్చినటువంటి పేరును తీసుకొస్తుందో లేదో చూడాలి...!
Advertisement
CJ Advs