తెలుగు ఇండస్ట్రీలో ఎన్నోహిట్ సాంగ్స్ ను పాడి తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఇండియన్ పాప్ సింగర్ బాబా సెహగల్. సింగర్ గానే కాకుండా నటునిగా 'రుద్రమదేవి' చిత్రంతో పరిచయం కానున్నాడు. అయితే స్క్రీన్ పై మాత్రం ఆయన పాత్ర తక్కువ సమయం ఉంటుందట. తాజాగా నాగచైతన్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ఓ చిత్రంలో ఫుల్ లెంగ్థ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రంలో బాబా సెహగల్ కనిపించనున్నారు.
అంతేకాకుండా చిరంజీవి 150వ చిత్రంలో కూడా ఓ నెగెటివ్ రోల్ లో బాబా సెహగల్ కనిపించే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారట.