>రెయిన్‌బో హాస్పిటల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మహేష్‌బాబు ఈ ఆసుపత్రికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన్ను మీడియా వారు ‘బాహుబలి’ సినిమాపై, ‘శ్రీమంతుడు’ వాయిదా అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... తెలుగుసినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు గర్వపడే సినిమా ‘బాహుబలి’. ఇండియన్ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్, భారీ ఎఫెక్ట్‌తో రూపొందుతున్న సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి’ సినిమా విడుదలకు మా ‘శ్రీమంతుడు’ సినిమా విడుదలకు మధ్య మూడు నాలుగు వారాల గ్యాప్ ఉండటమే మంచిది. ఇది పోటీ పడాల్సిన విషయం కాదు. హెల్దీ కాంపిటీషన్ ఉంటేనే అందరికీ మంచిది. అందుకే ‘బాహుబలి’ సినిమా విడుదల ఉంది కాబట్టే ‘శ్రీమంతుడు’ సినిమాను వాయిదా వేశాం... అని తన మనసులోని మాటను చెప్పారు సూపర్‌స్టార్ మహేష్‌బాబు.