లవర్‌బోయ్‌గా ఓకే అనిపించుకున్న హీరో నాగశౌర్య తొలిసారిగా మాస్ పాత్రలో కనిపించనున్న చిత్రం ‘జాదూగాడు’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం విషయంలో పెద్దగా అంచనాలు లేనప్పటికీ ఈ చిత్రం విడుదలైన తర్వాత మాస్ హీరోగా తన రేంజ్ మారిపోతుందనే ఆశతో నాగశౌర్య ఉన్నాడు. ఇక ప్రస్తుతం తాను చేస్తున్న నందినిరెడ్డి సినిమాతో పాటు రమేష్‌వర్మ దర్శకత్వంలో తాను హీరోగా నటించే చిత్రానికి ఇళయరాజా, శ్యామ్ కె. నాయుడు వంటి టాప్ టెక్నీషియన్స్‌తో కలిసి పనిచేస్తున్నానని, ఇక తన కెరీర్ ఊపందుకోవడం ఖాయమని అంటున్నాడు నాగశౌర్య.