Advertisement
Google Ads BL

‘బ్రూస్‌లీ’నే ఖరారు చేయనున్నారట...!


మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌ చుట్టుపక్కల షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ స్టంట్‌ మాస్టర్‌ పాత్రను పోషిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి ‘మై నేమ్‌ ఈజ్‌ రాజు, బ్రూస్‌లీ, సుప్రీం’ అనే టైటిల్స్‌ ఎక్కువగా వార్తల్లోకి వచ్చాయి. అయితే ఈ మూడు టైటిల్స్‌ కూడా అచ్చతెలుగులో లేవని, కేవలం డబ్బింగ్‌ చిత్రాలకు పెట్టే టైటిల్స్‌గా అనిపిస్తున్నాయని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి ‘బ్రూస్‌లీ’ అనే టైటిల్‌నే ఖరారు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ టైటిల్‌ను మరికొద్ది రోజుల్లో అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs