‘టెంపర్’తో పూరీపై పూర్తి నమ్మకాన్ని కలిగించిన మెగాస్టార్ తన 150 వచిత్రానికి పూరీనే డైరెక్టర్ అని ప్రకటించాడు. అయితే పూరీ తీసిన తాజా చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’తో పూరీ అంటే మెగాఫ్యామిలీకి చులకన భావం ఏర్పడిరదట. దాంతో ఈ చిత్రాన్ని మొదట అనుకున్నట్లుగా వినాయక్ చేతికి అందించాలని యోచనలో మెగాఫ్యామలీ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వినాయక్‌తో ఐదు గంటల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యాడట. ఈ మీటింగ్ నుండి బయటకు వచ్చిన వెంటనే వినాయక్ పలువురు రైటర్లకు ఫోన్ చేసి మెగాస్టార్‌కు తగిన స్టోరీలు ఏమైనా ఉన్నాయా?అని వాకబు చేశాడని, కొందరు ఉన్నాయని చెప్పారని, అయితే ముందు జాగ్రత్తగా వీలైనన్ని ఎక్కువ స్టోరీలతో మెగాస్టార్‌ను కలిసే యోచనలో వినాయక్ ఉన్నాడని సమాచారం.