Advertisement
Google Ads BL

మరలా వాయిదా పడిన ‘కిక్‌2’!


సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రవితేజ, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు జంటగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘కిక్‌2’ విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. మొదట ఈ చిత్రాన్ని మేలో రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ ‘లయన్‌’ సినిమా ఉండటంతో దానికి పోటీ ఉండకూడదని వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్‌లో అనుకున్నారు. అదీ వాయిదా పడింది. ఎట్టకేలకు జులైలో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ సినిమా లెంగ్త్‌ విషయంలో ఇబ్బందులు రావడం, సినిమా నిడివి పెరిగిపోవడం, ఎడిటింగ్‌కు దర్శకుడు ఒప్పుకోకపోవడం, చాలా సన్నివేశాలను రీషూట్‌ చేయాల్సిరావడంతో ఈ చిత్రం విడుదల వాయిదాపడుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ చిత్రాల ఉద్ద్థృతి తగ్గిన తర్వాత అంటే ఆగష్టు మూడో వారంలో విడుదల చేయాలని నిర్ణయించిన్నట్లు సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs