>టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు వరుసగా ‘1’ (నేనొక్కడినే), ‘ఆగడు’ వంటి డిజాస్టర్స్ రావడంతో అభిమానులతో పాటు మహేష్ కూడా నిరుత్సాహపడ్డాడు. ఆ ఎఫెక్ట్ ‘శ్రీమంతుడు’పై పడుతుందని అందరూ భావించారు. అయితే ‘బాహుబలి’తో పోటీ ఉంటుందని భయపడ్డ కొనుగోలు దారులు ఇప్పుడు సినిమా డేట్‌ను మార్చడంతో ఈ చిత్రాన్ని కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబు కూడా ఓ నిర్మాత కావడంతో మహేష్ నిర్మాతల చేత, దర్శకుడి చేత తక్కువ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించడంతో సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రానికి బడ్జెట్ కేవలం 35 నుండి 40కోట్ల లోపలే అని సమాచారం. ఇక థియేటికల్ రైట్స్ దాదాపు 55కోట్లకు అమ్ముడుపోయాయని, ఓ 10కోట్లు శాటిలైట్ రూపంలో రావడంతో ఇప్పటికే ఈ చిత్రం 65కోట్లను నిర్మాతలకు సంపాదించి పెట్టిందని సమాచారం. అంటే దాదాపు 25కోట్ల లాభంలో ఈ చిత్రం ఉండటం నిజంగా అభినందనీయం అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. బడ్జెట్‌ను కంట్రోల్ చేయగలిగితే స్టార్ హీరోల చిత్రాలు భారీ లాభాలను చవిచూడవచ్చని మరోసారి రుజువైందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.