Advertisement
Google Ads BL

'గబ్బర్ సింగ్2'లో విలన్ తనేనా..?


'గబ్బర్ సింగ్' సినిమా విడుదలయిన చాలా కాలం వరకు పవన్ ముఖానికి రంగేసుకోలేదు. ఆయన 'గబ్బర్ సింగ్2' సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో అని వారి అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. ఎట్టకేలకు ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైందని దర్శకుడు బాబి ట్వీట్ చేసారు. అయితే ఈ చిత్రంలో విలన్ కోసం పవన్ కళ్యాన్, డైరెక్టర్ బాబీ చాలా మందిని పరిశీలించారు. తాజాగా విలన్ పాత్రకు శరద్ కేల్కర్ అనే సీరియల్ నటుడిని కన్ఫర్మ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

Advertisement
CJ Advs

శరద్ కేల్కర్ 'పతి పత్ని ఔర్ ఓ' , 'కుచ్ తో లోగ్ కహెంగే' అనే సీరియల్స్ లో నటించాడు. అంతేకాకుండా 'రామ్ లీల' , 'లై భారి' లాంటి బాలీవుడ్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. శరద్ కు సంబంధించిన కొన్ని వీడియోలను చూసిన పవన్, బాబీ ఇంప్రెస్ అయ్యి ఆయనని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs