బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘బజరంగీ బాయిజాన్’. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఇది నేను ఎంతో గర్వపడాల్సిన విషయం. మా నాన్న విజయేంద్రప్రసాద్ సల్మాన్‌ఖాన్ నటించిన ‘బజరంగీ బాయిజాన్’ చిత్రానికి కథను అందించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ చిత్ర టీమ్‌కు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను... అని ట్వీట్ చేశాడు. కాగా ఈ చిత్రం రంజాన్ పండగ కానుకగా జులై 17న విడుదలకు సిద్దమవుతోంది....!