మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో దిల్‌రాజు బందం రోజురోజుకీ ఫెవికాల్‌ను మించి బలపడుతోంది. కాగా సాయి నటించిన ‘పిల్లా... నువ్వులేని జీవితం’ తర్వాత దిల్‌రాజు తాజాగా సాయితో హరీష్‌శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మరలా సాయితోనే ‘శతమానంభవితి’ చిత్రం చేయనున్నాడు. తాజాగా దిల్‌రాజు త్వరలో మరోసారి సాయితో ఇంకో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని, ‘పటాస్’ చిత్రంతో రచయితగా, దర్శకునిగా అందరి చేత సెహభాష్ అనిపించుకొని, కళ్యాణ్‌రామ్‌కు అతిపెద్ద హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. మొత్తానికి మెగామేనల్లుడు దిల్‌రాజు ఆస్ధాన కథానాయకుడు అయ్యాడని ఒప్పుకోకతప్పదు.