ఇప్పటికే సుధీర్‌బాబు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం విడుదలైంది. క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కాగా త్వరలో సుధీర్‌బాబు నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈలోగా సుధీర్‌బాబు ఓ బాలీవుడ్ చిత్రంలో కీలకపాత్ర పోషించడానికి ఓకే చేశాడు. ఇప్పుడు సైలెంట్‌గా మరో సినిమా పూర్తీ చేస్తున్నాడు. సుధీర్‌బాబు హీరోగా ‘భలే మంచిరోజు’ అనే టైటిల్‌తో ఓ క్రైమ్‌కామెడీ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సుధీర్‌బాబు తన స్నేహితులతో కలిసి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మూడొంతులు పూర్తయిందని తెలుస్తోంది. ఆగష్టు నెలాఖరున గానీ లేదా సెప్టెంబర్ మొదటి వారంలో గానీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే కనుక విడుదలైతే ఈ ఏడాది సుధీర్‌బాబు నటించిన మూడు చిత్రాలు విడుదలయినట్లుగా చెప్పుకోవాలి. ఈ చిత్రం ద్వారా శ్రీరామ్ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నాడు. త్వరలో ప్రమోషన్ పనులు మొదలుకానున్న ఈ చిత్రం ఒక్కరోజులో జరిగే కథ అని తెలుస్తోంది.