కె.యస్.రవికుమార్.. నిన్న మొన్నటి వరకు తమిళంలో తిరుగులేని సీనియర్ డైరెక్టర్. అయితే ఇటీవల రజనీకాంత్‌తో ఆయన తీసిన ‘లింగా’ చిత్రం డిజాస్టర్ అయి నిర్మాతతోపాటు రజనీని కూడా ముప్పుతిప్పలు పెట్టడంతో ప్రస్తుతం ఆయనతో సినిమా చేయాలని ఏ హీరో కోరుకోవడంలేదు. ఇక ఆయన దర్శకుడైతే పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలతోపాటు ఫైనాన్షియర్లు కూడా మొగ్గుచూపడం లేదు. దాంతో ఈ టాలెంటెండ్ డైరెక్టర్ కన్నడ చిత్రాలపైకి చూపులు తిప్పాడు. అక్కడయితే తనకు బాగా అవకాశాలు వస్తాయనే ఆశతో ఉన్న ఆయన త్వరలో కన్నడస్టార్ సుదీప్ (‘ఈగ’ ఫేమ్) హీరోగా ఓ పక్కా యాక్షన్ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈచిత్రంపై సుదీప్ కూడా ఆశలు పెట్టుకొని ఉన్నాడట. ఎంతైనా పెద్దగా క్రేజ్‌లేని కన్నడ పరిశ్రమ అనేక మంది పరభాషా ఫ్లాప్ డైరెక్టర్లను ఆదరిస్తోందని చెప్పవచ్చు.