‘బాహుబలి’ గురించి రోజుకో ఆసక్తికర వార్త వస్తోంది. లేటెస్ట్‌గా ఇలాంటి వార్త మరోటి వచ్చింది. ‘బాహుబలి’ క్లైమాక్స్ సీన్ దాదాపు 30నిమిషాల పాటు సాగుతుందట. ఆ సీన్ సినిమా మొత్తానికే హైలైట్ అని తెలుస్తోంది. ఈ 30నిమిషాల కోసం దాదాపు 30కోట్లు వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. మహాభారత యుద్దాన్ని తలపించే విధంగా ఈ ఎపిసోడ్ అత్యద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్ సీక్వెన్స్ అబ్బురపరిచే విధంగా రావాలని, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి సీన్స్ ఎప్పుడు రాలేదు అనే విధంగా ఉండేలా రాజమౌళి తన టీమ్‌తో కలిసి ఎంతో కష్టపడి, అన్ని కోట్లు వెచ్చించి తీశాడట. మరి సినిమా విడుదలైతే గానీ విజువల్ గ్రాండిటీకీ ఈ సీన్ అర్థం చెబుతుందో లేదో చూడాలి...!