హార్ట్ ఎటాక్ సినిమా తర్వాత నితిన్, పూరి కాంబినేషన్‌లో మళ్ళీ ఓ సినిమా స్టార్ట్ కాబోతోందని ఆమధ్య వార్తలు వచ్చాయి. వార్తలు రావడమే కాదు.. నితిన్, పూరి కూడా కలిసి సినిమా చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా ఇద్దరూ హగ్ చేసుకొని మరీ ఫోటోలు దిగారు. ఇంతా జరిగి వారం అవక ముందే ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా లేదని ఇద్దరూ విడివిడిగా చెప్పేశారు. తను వరుణ్‌తేజ్‌తో సినిమా చెయ్యబోతున్నానని పూరి అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసేశాడు. నితిన్‌తో సినిమా స్టార్ట్ చేస్తానన్న డేట్‌కే వరుణ్‌తో సినిమా స్టార్ట్ అయిపోతుందని ట్విట్టాడు కూడా. అయితే ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి సౌండూ ఇప్పుడు లేదు. నితిన్ సినిమా లేదు అని చెప్పడం కోసం ఇదే నెలలో వరుణ్‌తో సినిమా స్టార్ట్ చేసేస్తున్నానని, ఈ సినిమాని సి.కళ్యాణ్ బేనర్‌లో చెయ్యబోతున్నానని చెప్పిన పూరి ఇప్పుడు వరుణ్‌తో సినిమా చేస్తాడా? లేదా? అనే డౌట్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ ‘ఆటోజానీ’కి సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ని చిరంజీవికి వినిపించడం, ఓకే అయిపోవడం కూడా జరిగింది. ఆ సినిమాకి సంబంధించిన సెకండాఫ్‌పై పూరి కసరత్తు చేస్తున్నాడు. చిరు నుంచి ఎప్పుడు పిలువు వస్తే అప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ స్టోరీ కూడా నేరేట్ చెయ్యాలి. ప్రస్తుతం చిరంజీవి సినిమాకి సంబంధించిన హడావిడిలో వున్న పూరి మరో సినిమా మీద కాన్‌సన్‌ట్రేట్ చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. అంటే వరుణ్‌తో ఇప్పట్లో సినిమా చేసే ఛాన్స్ లేనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ‘ఆటోజానీ’ తర్వాత ఇమ్మీడియట్‌గా మహేష్‌తో సినిమా చెయ్యాల్సి వుంది. కాబట్టి ప్రస్తుతం పూరి కాన్‌సన్‌ట్రేషన్ అంతా ‘ఆటోజానీ’పైనే వుందనేది అర్థమవుతోంది.