Advertisement
CJ Advs
`బాహుబలి` పాటల వేడుకలో రాజమౌళి మొట్టమొదట కథానాయకుడు బాలకృష్ణకి థ్యాంక్స్ చెప్పాలనుకొన్నాడు. కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు. ఇంతకీ బాలకృష్ణకి రాజమౌళి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకొన్నాడు? ఆయనకీ, `బాహుబలి`కీ మధ్య సంబంధమేమిటి? అనే ప్రశ్నలు రావొచ్చు. బాలకృష్ణకీ, బాహుబలి పాటల వేడుకకీ మధ్య ఓ పెద్ద సంబంధమే ఉంది. అదేంటంటే... తిరుపతిలో `బాహుబలి` పాటల వేడుక జరుపుకొనేందుకు పర్మిషన్ ఇప్పించింది బాలకృష్ణనేనట. హిందూపురం ఎమ్మేల్యేగా, సీఎం బావమరిదిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు బాలకృష్ణ. హైదరాబాద్‌లో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో... తిరుపతిలో వేడుకకి పర్మిషన్ ఇప్పించాలని నిర్మాతలు బాలయ్యని అడిగారట. ఆయన వెంటనే తన పరపతిని ఉపయోగించి అక్కడ పర్మిషన్ ఇప్పించేశాడు. అయితే ఆ విషయాన్ని ఆడియో వేడుకలో చెప్పాలనుకొన్న రాజమౌళి మరిచిపోయారు. తీరా ఆదివారం బాలకృష్ణ సాయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆయన విషయంలో నేనొక ఇడియట్‌లా వ్యవహరించా. పాటల వేడుక జరుపుకోవడానికి పర్మిషన్ ఇప్పించింది ఆయనే. ఆయనకి బాహుబలి టీమ్ తరఫున ప్రత్యేకంగా కృతజ్జతలు చెబుతున్నానని ట్వీట్ చేశారు రాజమౌళి.