టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇద్దరు టాప్ అండ్ యంగ్‌డైరెక్టర్లు తమ సినిమాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిద్దరే బోయపాటి శ్రీను, సుకుమార్. బోయపాటి డైరెక్షన్‌లో అల్లుఅర్జున్ హీరోగా గీతాఆర్ట్స్ బేనర్‌లో ఓ చిత్రం ప్రారంభం కావాల్సివుంది. అయితే పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ ఈ చిత్రం సెట్స్‌పైకి ఎప్పుడు వెళుతుందో తెలియడం లేదు. ఇక సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించే చిత్రం కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. తాజాగా ఈ చిత్రం ఈనెల 25 నుండి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం 25 వ తేదీన లండన్‌లో ప్రారంభం అవుతుందని, అక్కడ దాదాపు 45రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని, ఈ షెడ్యూల్‌లో పాటలను, కీలకసన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. మరి ఈ చిత్రమైనా అదే తేదీన ప్రారంభం అవుతుందో లేదో చూడాల్సివుంది..!
Advertisement
CJ Advs