పెళ్లి విషయంపై అనుష్క....!
టాలీవుడ్ బ్యూటీ అనుష్క తన పెళ్లి ప్రస్తావన రాగానే తనదైన రీతిలో ధీటైన సమాధానాలు తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ... గడిచిన ఆరేళ్లలో నా పెళ్లి గురించి మీడియాలో రకరకాల వార్తలు విన్నాను. పెళ్లికి సంబంధించిన విషయాల్లో నేను తప్పించుకోవడానికి ఏమీ ప్రయత్నం చేయడం లేదు. సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా లేదు. అందరినీ ఆహ్వానించి పెళ్లి చేసుకుంటాను. అది లవ్ మ్యారేజ్ అయినా లేక అరేంజ్‌డ్ మ్యారేజ్ అయినా సరే అందరికీ చెప్పే చేసుకుంటాను. నా పెళ్లి అందరికీ తెలిసే జరుగుతుంది... అని సమాధానం ఇచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ... చాలామంది నేను ఇంత అందంగా ఎలా ఉండగలుగుతున్నాను...అని అడుగుతున్నారు. ఈ విషయంలో నేను ముందుగా చెప్పేది ఏమిటంటే అందం అనేది తల్లిదండ్రుల జీన్స్ నుండే వస్తుంది. తర్వాత మంచి ఆహారం తీసుకొనే అలవాటు, వ్యాయామం, యోగా వంటివి చేయడం ద్వారా కాపాడుకోవచ్చు అంతకు మించి ఏమీ లేదు.. అని చెప్పుకొచ్చింది.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads