రాజమౌళి లేటెస్ట్ మూవీ ‘బాహుబలి’కి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ కారణంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కొంతమందికి రుచించలేదు. ట్రైలర్ సంగతి పక్కన పెట్టేసి ఆడియో రిలీజ్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. మొదట మే 31న ఆడియో రిలీజ్ చేస్తామని చెప్పిన రాజమౌళి కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా ఆడియో ఫంక్షన్‌ను వాయిదా వేస్తున్నట్టు, ఫంక్షన్ ఎప్పుడు వుంటుందనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పాడు. జూన్ 8న జరుగుతుందని, జూన్ 10న ఆడియో ఫంక్షన్ వుంటుందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇవేవీ కాకుండా జూన్ 13న ఈ ఫంక్షన్‌ను తిరుపతిలో చెయ్యాలని డిసైడ్ అయ్యాడు రాజమౌళి. ‘బాహుబలి’ ఫంక్షన్‌కి వెళ్ళాలని ఆ ఫంక్షన్‌ని చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ ప్రేక్షకులకు, అభిమానులకు నిరాశే మిగిల్చాడు రాజమౌళి. ఇక్కడ భద్రతా సమస్యలు వస్తాయని ఆడియో ఫంక్షన్‌ని వాయిదా వేశారు బాగానే వుంది. తిరుపతిలో ఫంక్షన్ చెయ్యడం వల్ల భద్రతా సమస్యలు రావా? హైదరాబాద్ పోలీస్ ఫంక్షన్‌కి వచ్చే జనం కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయలేరని అతని ఉద్దేశమా? తిరుపతి పోలీసుల మీద వున్న నమ్మకంతోనే రాజమౌళి అక్కడ ఫంక్షన్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.