దక్షిణాది టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లో మొదటి నుండి శంకర్, రాజమౌళిల పేర్లు బలంగా వినిపిస్తూ వస్తున్నాయి. అయితే దాదాపు 200కోట్లతో తెరకెక్కిన శంకర్ చిత్రం ‘ఐ’ కలెక్షన్లు అయితే బాగానే రాబట్టగలిగింది కానీ ప్రేక్షకులను మురిపించలేకపోయింది. శంకర్ దర్శకత్వానికి ఈ చిత్రంలో నెగటివ్ మార్కులు పడగా, కేవలం విక్రమ్ కష్టానికి మాత్రమే పేరొచ్చింది. ఇక ఇప్పుడు రాజమౌళి వంతు వచ్చింది. దాదాపు ‘ఐ’ తో సరిసమానమైన బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘బాహుబలి.. ది బిగినింగ్’ చిత్రం ఎలా ఆడుతుంది? రాజమౌళికి ఈ చిత్రంతో ఎంత పేరొస్తుంది? ముఖ్యంగా ఈ చిత్రం విమర్శకుల నుండి ఎలాంటి కామెంట్స్‌ను పొందుతుంది? అనేది తేలాల్సివుంది. దాని కోసం జులై 10వరకు వెయిట్ చేయకతప్పదు. ప్రస్తుతానికి అయితే ‘బాహుబలి’కి మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్‌లో సైతం కరణ్‌జోహార్ తన తన శక్తివంచన లేకుండా కృషి చేస్తూన్నాడు. ఇక తమిళంలో కూడా హక్కులు పొందిన జ్ఞానవేల్ రాజా మంచి హైప్ క్రియేట్ చేయగలుగుతున్నాడు. మరి ‘ఐ’ విషయంలో ఆడియోను గ్రాండ్‌గా నిర్వహించడంతో క్రేజ్ మరీ ఎక్కువైంది. అంతేగాక అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవడం వంటివి చిత్రానికి చాలా నష్టం చేకూర్చాయి. ప్రస్తుతం విడుదల విషయంలో ‘బాహుబలి’ కూడా అదే దారిలో నడుస్తోంది. మరి జులై 10 అయినా ఈ చిత్రం ఖచ్చితంగా విడుదల కావాల్సిన అవసరం ఎంతో ఉంది.