Advertisement
Google Ads BL

పవన్‌కల్యాణ్‌ అందుకే రాలేదట..!!


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భూమి పూజకు పవన్‌కల్యాణ్‌ హాజరుకాకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో రాజధాని శంఖుస్థాపనకు కచ్చితంగా తాను హాజరవుతానని పవన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజధాని కోసం రైతులనుంచి బలవంతంగా భూమి లాక్కుంటున్నందుకే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదన్న వార్తలు వినిపించాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పవన్‌కు అసలు పిలుపే వెళ్లలేదన్న చర్చలు కూడా కొనసాగాయి. అయితే ఈ వార్తలపై టీడీపీ నాయకులు స్పందించారు.

Advertisement
CJ Advs

మీడియాలో వస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ భూమిపూజకు హాజరు కాకపోవడానికి వేరే ఏ కారణాలు లేవని వారు చెప్పుకొచ్చారు. గబ్బర్‌సింగ్‌-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే పవన్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని వారు చెబుతున్నారు.  పవన్‌, బాబుల మధ్య ఎలాంటి విబేధాలు లేవని, రాష్ట్ర అభివృద్ధికోసం వారిద్దరూ కలిసి పనిచేస్తారని వారు ప్రకటించారు. మరి ఈ ప్రకటనలో నిజానిజాలు దెవుడెకెరుక.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs