Advertisement
Google Ads BL

మరోసారి ఖాకీ డ్రెస్సులో రామ్‌చరణ్‌..!!


శ్రీనువైౖట్ల, రామ్‌చరణ్‌ల సినిమాకు సంబంధించి రోజుకో కొత్త అంశం మీడియా ముందుకు వస్తుంది. ఈ సినిమా పబ్లిసిటీ గురించి చిత్రం యూనిటే ఇలా లీకులిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొదట ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ఓ స్టంట్‌ మాస్టర్‌లా యాక్ట్‌ చేస్తున్నాడన్న సమాచారం వెలువడింది. దీనికి తగినట్లే ఈ సినిమా పేరు 'బ్రూస్‌ లీ'గా చిత్రం యూనిట్‌ నిర్ణయించినట్లు తెలిసింది. అంతకుముందు ఈ సినిమా టైటిల్‌ 'మై నేమ్‌ ఈజ్‌ రాజు'గా ప్రచారం ఉండింది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే ఈ సినిమాలో రామ్‌చరణ్‌ స్టంట్‌ మాస్టర్‌లా కాకుండా ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడని. ఈ మేరకు రామ్‌చరణ్‌ ఖాకీ డ్రెస్సులో ఉన్న పలు ఫొటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. గతంలో 'తుఫాన్‌' సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించాడు. ఇక శ్రీనువైట్ల హీరోలను పోలీసు ఆఫీసర్లుగా పవర్‌ఫుల్‌గా చూపించడంలో సిద్ధహస్తుడు. దీంతో ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్‌ చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs