రెండున్నర మూడేళ్లుగా ‘బాహుబలి’ చిత్రం కోసం గెడ్డాలు, మీసాలు పెంచిన హీరో ప్రబాస్, రానా, రాజమౌళి ఇప్పుడు కొత్తలుక్‌తో కనిపిస్తున్నారు. ప్రభాస్ రీసెంట్‌గా తన గెడ్డాలను, మీసాలను తీసి కొత్తలుక్‌లో కనిపిస్తుంటే రానా మాత్రం దాదాపు 20రోజుల క్రితమే ఇతర సినిమాలతో బిజీ అయి తన లుక్‌ను మార్చుకున్నాడు. ఇక ఇంత కాలం ముని వేషంలో ఉన్న రాజమౌళి కూడా తన సహజసిద్దమైన గెటప్‌లోకి చేంజ్ అయ్యాడు. మరి దాదాపు మూడేళ్లుగా వారు చేసిన యజ్ఞానికి ఎలాంటి ప్రతిఫలం లభించనుందో సినిమా విడుదలయితే కానీ చెప్పలేం. రానా ఇతర సినిమాలతో బిజీ కాగా ‘బాహుబలి’ పార్ట్ 2 లోని మిగిలిన 30శాతం షూటింగ్‌లో రాజమౌళి లీనం కానున్నాడు. ఇక ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో చేసే చిత్రం కోసం ‘వర్షం’ నాటి గెటప్‌లో ఆకట్టుకుంటున్నాడు.
Advertisement
CJ Advs