సైకిల్ తొక్కుతూ స్టైల్‌గా, కూల్‌గా వచ్చిన ‘శ్రీమంతుడు’ ఫస్ట్‌లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే ఆ సైకిల్ అల్లాటప్పా కాదంట..! అమెరికన్ బ్రాండ్ సైకిల్ అది. విలువ దాదాపు 3.5 లక్షలు. ఎడారుల్లో, కొండ ప్రాంతాల్లో, రోడ్లు సరిగ్గా లేని చోటైనా సరే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అందుకే దానికి అంత ఖరీదు. పైగా ఇది ‘శ్రీమంతుడు’ తొక్కే సైకిల్ కదా..! ఆ మాత్రం విలువ లేకపోతే ఎలా? దీనిపై సరదా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ‘మూడున్నర లక్షలా.. దాని బదులు కారు కొనుక్కోవచ్చుగా.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా కారంటే మహేష్‌కు, ఆయన తండ్రికి చాలా భయమంట. కారు గుర్తు పెట్టుకొని గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కూడా కారే. ఆ కారును చూసి భయపడి హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీ నిర్మిస్తే దానికి కేసీఆర్ పేరే పెట్టాలని మన సూపర్‌స్టార్ కృష్ణ గారు సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అదే సైకిల్ అయితే తమను పెద్దగా ఇబ్బంది పెట్టదని, ఎలాగూ గల్లాజయదేవ్ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు మన వాడేలే అనుకున్నారని, అందుకే కారును వదిలి సైకిల్ పట్టుకున్నాడని మహేష్‌పై సెటైర్లు వేస్తున్నారు.
Advertisement
CJ Advs