టాలీవుడ్‌కు వేసవి తర్వాత అంత మంచి సీజన్ సంక్రాంతే. కాగా గత రెండేళ్లుగా బాక్సాఫీస్‌ల వద్ద పెద్ద సందడి కనిపించడం లేదు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం భారీ పోటీ తప్పేట్లు లేదు. మెగాస్టార్ చిరంజీవి చేయనున్న 150 వచిత్రాన్ని ఎలాగైనా స్పీడ్‌గా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని మెగా ఫ్యామిలీతో పాటు పూరీజగన్నాథ్ కూడా పట్టుదలతో ఉన్నాడు. ఇక మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ కూడా సంక్రాంతినే టార్గెట్ చేసింది. ఎన్టీఆర్`సుకుమార్‌ల చిత్రాన్ని కూడా సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నారు. పనిలో పనిగా ‘బాహుబలి’ రెండో పార్ట్ కూడా సంక్రాంతికే వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాలకృష్ణ ‘డిక్టేటర్’ కూడా సంక్రాంతికే అంటున్నారు. మరి వీటిలో చివరకు ఎన్ని సంక్రాంతి రేసులో మిగులుతాయో వేచిచూడాల్సివుంది.