ప్రస్తుతం అక్కినేని అఖిల్ సోలో హీరోగా తెరంగేట్రం చేస్తూ మాస్ చిత్రాల దర్శకుడు వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మాణ సంస్థలో తొలి చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని మొదట్లో ఆగష్టులో విడుదల చేయాలని భావించారు. ఆగష్టులో అయితేనే అఖిల్‌కు హ్యాపీగా ఉండేది. కానీ షూటింగ్ ఆలస్యమవుతుండటంతో ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా విడుదల చేయాలా? లేక దసరా కానుకగా విడుదల చేయాలా? అనే సందిగ్ధంలో యూనిట్ ఉంది. వినాయక చవితికి వద్దామంటే ఇప్పటికే మాస్‌మహారాజా రవితేజ ‘బెంగాల్‌టైగర్’కు కర్చీఫ్ వేసిఉన్నాడు. పోనీ దసరా కానుకగా వద్దామంటే రామ్‌చరణ్`శ్రీనువైట్లల చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానుంది. దీంతో ఎలాగూ అఖిల్‌కు పోటీ తప్పేట్లు లేదు. మొత్తానికి దసరానే ఈ యూనిట్ టార్గెట్ చేసినట్లు సమాచారం. రామ్‌చరణ్ చిత్రానికి ఒకటి రెండు వారాల గ్యాప్ తీసుకొని అఖిల్ మొదటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.