Advertisement
Google Ads BL

దేనికైనా రెడీ అంటోన్న చార్మి...!


ఒకప్పుడు తెలుగులో టాప్‌ హీరోలతో సైతం నటించి ప్రముఖ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న పంజాబీ భామ చార్మి. కాగా ఈ అమ్మడు ఇప్పుడు ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని ఆమె చావోరేవో అన్నట్లుగా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌గా ఫీలవుతోంది. హీరోయిన్‌ వేషాలు తగ్గిన తర్వాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు, ఐటంసాంగ్స్‌కే పరిమితమైన ఈ అమ్మడు ‘జ్యోతిలక్ష్మీ’పై బోలెడు ఆశలు పెట్టుకొని ఉంది. కాగా ఈ చిత్రం ఆడియో వేడుక జూన్‌ 4న జరుగనుంది. నాగ్‌ నుండి నితిన్‌ వరకు అందరితో కలిసి నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం ప్రమోషన్‌ పనులను తానే సొంతంగా చూసుకుంటోంది. కాగా ఈ చిత్రం నిర్మాతల్లో చార్మి కూడా ఒకరు కావడం విశేషం. ఈ చిత్రానికి దర్శకుడు పూరీ, హీరోయిన్‌ చార్మి, సి.కళ్యాణ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ‘జ్యోతిలక్ష్మీ’ ఆడియో వేడుకలో చార్మి  స్పెషల్‌ లైవ్‌ షో ఇచ్చి వేదికపై డాన్స్‌ చేయనుండటం విశేషం. మరి తనకు కీలకమైన ఈ చిత్రానికి ఆమె ఆ మాత్రం కష్టపడటంలో తప్పేమీ లేదని చెప్పవచ్చు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs