2013లో స్వామిరారా విజయంతో అందరి ప్రశంసలు అందుకున్న ఆ చిత్ర టీమ్‌కు ఈ సంవత్సరం (2015) కలిసి రాలేదు. ఈ చిత్ర కథానాయకుడు నిఖిల్ ‘సూర్య వర్సెస్ సూర్య’తో యావరేజీ విజయాన్ని అందుకోగా, దర్శకుడు సుధీర్ వర్మ తన ద్వితీయ ప్రయత్నంగా తెరకెక్కించిన ‘దోచెయ్’ ప్రేక్షకుల తిరస్కరించడంతో ఫ్లాప్‌గా నమోదైంది. ఇక స్వామిరారా సీక్వెల్‌గా సుధీర్‌బాబును హీరోగా పెట్టి ‘స్వామిరారా’ నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ టాక్‌పరంగా పాజిటివ్‌గా వున్న కలెక్షన్ల పరంగా నిరాశజనకంగా వుండటంతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.