Advertisement
Google Ads BL

ఆనం చేష్టలపై సినిమా తీస్తారట..!!


నెల్లూరులో పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి, నిర్మాత సి.కల్యాణ్‌ల మధ్య వివాదం ముదురుతోంది. 'బస్తీ మే సవాల్‌ కొట్టుకుందాం రా..' సవాల్‌ చేసుకునే వరకూ వీరి వివాదం ముదిరింది. ఇక అంతటితో ఆగకుండా నిర్మాత కల్యాణ్‌ ఆనంకు ఓ హెచ్చరిక పంపాడు. ఆనం చేష్టలపై 'రంభతో లాలికాడు' అనే సినిమా తీసే యోచన ఉందని చెప్పాడు. మరి కల్యాణ్‌ హెచ్చరికలపై ఆనం ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది.

Advertisement
CJ Advs

అయితే వీరిద్దరి మధ్య వివాదానికి నెల్లూరు జిల్లాలోని ఓ స్థలం కారణంగా తెలుస్తోంది. రూ. 1.60 కోట్లకు సదరు స్థలాన్ని తాను కొనుగోలు చేశానని కల్యాణ్‌ చెబుతుంటే.. లేదు వక్ఫ్‌బోర్డుకు చెందిన ఆ స్థలాన్ని కల్యాణ్‌ కబ్జా చేసుకున్నారంటూ ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల వెనుక ఆనం వివేకానందరెడ్డి ఉన్నారని, ఆ స్థలంలో ఆయనకు వాటా ఇవ్వకపోవడంతోనే ఇలా లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని కల్యాణ్‌ ఆరోపించారు. వివేకానందరెడ్డికి పిచ్చి పట్టిందని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. ఇక ఈ విషయాలన్ని పక్కనపెడితే ఆనం వివేకానందరెడ్డి చేష్టలపై ఓ సినిమా తీస్తే కామెడీ అదిరిపోతుందని బీ, సీ క్లాసు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs