బాలీవుడ్ వెటరన్ హీరో ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య హేమామాలిని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, భూజానికి శస్త్రచికిత్స చేయించుకునే అవసరం వచ్చిందని చెప్పారు. ఇక ఆయన అకూతురు ఇషాడియోల్ కూడా స్పందిస్తూ.. నాన్న ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి కావచ్చని చెప్పారు.
ప్రస్తుతం ధర్మేంద్ర 'సెకండ్ హ్యాండ్ హస్‌బెండ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో గోవింద కుమార్తె నర్మద అహుజా హీరోగాన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగానే ఆయన గాయపడినట్లు సమాచారం. అయితే అప్పుడు గాయం తాలుకు తీవ్రత తెలియకపోవడంతో ధర్మేంద్ర పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు అదే గాయం ఆయన్ను ఆస్పత్రి పాలుచేసినట్లు సమాచారం. ఈ వెటరన్ హీరో త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.