ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు, రాజమౌళి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ రిలీజ్ దగ్గర పడుతోంది. దాదాపు 45 రోజుల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలిసినప్పటికీ నెక్స్‌ట్ వీక్ రిలీజ్ అన్నంత ఉత్సాహంగా వున్నారంతా. ఇదిలా వుంటే మే 31న ‘బాహుబలి’ టీజర్‌తోపాటు ఆడియో ఫంక్షన్ కూడా చేయబోతున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ఆడియో ఫంక్షన్‌ని టివి5 ఎక్స్‌క్లూజివ్‌గా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అయితే ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రెస్‌మీట్ జరగలేదు. రేపు(28) ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్‌మీట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్‌మీట్ సారాంశం ఏమిటి? ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పబోతున్నారు? అనే విషయంపై మీడియాలో వాడి, వేడి చర్చలు మొదలయ్యాయి. దీనికితోడు మే 31న ‘బాహుబలి’ ఆడియో ఫంక్షన్ లేదని, జూన్ 7న గానీ, 8న గానీ ఆడియో రిలీజ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అది చెప్పడం కోసమే రేపు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తున్నారని కొందరు చెప్తున్నారు. అయితే ఈ సినిమా ఆడియో రిలీజ్ విషయంలో ఇవన్నీ పుకార్లేనని, ఎట్టి పరిస్థితుల్లో మే 31న ఆడియో రిలీజ్ వుంటుందని టివి5 ఛానల్‌కి సంబంధించిన వారు చెప్తున్నారు. ఏది ఏమైనా ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన ప్రెస్‌మీట్ పెడుతున్నారంటేనే మీడియాలో ఇంత హడావిడి మొదలైందంటే, రేపు ఆడియో ఫంక్షన్‌కి ఇది ఏ రేంజ్‌లో వుంటుందో ఊహించుకోవచ్చు. అన్నింటినీ మించి సినిమా రిలీజ్‌కి ఆడియన్స్‌లో, ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా వుంటుందో చెప్పడం కష్టంగా మారింది.